My title

మెహబూబా ప్రారంభం…. చార్మి హల్ చల్

తన పుట్టినరోజు సందర్భంగా కొడుకును హీరోగా పెట్టి సినిమా చేస్తానని ప్రకటించాడు పూరి జగన్నాథ్. అదే రోజు సినిమాకు మెహబూబా అనే పేరుపెట్టామని, హీరోయిన్ గా మంగుళూరు భామ నేహా షెట్టిని తీసుకున్నామని, సందీప్ చౌతా సంగీతం అందిస్తాడని ప్రకటించాడు. ఇన్ని విషయాలు చెప్పిన పూరి…. ఈ సినిమాకు కూడా చార్మి వర్క్ చేస్తుందనే విషయం చెప్పలేదు. మొదటి రోజంతా చార్మి హడావుడే కనిపించింది.

మెహబూబా సినిమా సైలెంట్ గా స్టార్ట్ అయింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ అందమైన లొకేషన్ లో నిన్న ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ముహూర్తం షాట్ తీశారు. ఆ తర్వాత ఫస్ట్ షాట్ చిత్రీకరించారు. ఈ రెండు ఎలిమెంట్స్ లో చార్మి హంగామా స్పష్టంగా కనిపించింది. అంతేకాదు, ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టింది కూడా చార్మినే. అలా పూరి కొడుకు ఆకాష్ హీరోగా మెహబూబా సినిమా చార్మి చేతుల మీదుగా ఓపెన్ అయింది.

ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే… ఈ సినిమా ఓపెనింగ్ కు బాలకృష్ణ ముహూర్తం పెట్టాడట. ఈ విషయాన్ని పూరీనే వెల్లడించాడు. తమ సినిమాను బాలయ్య పెట్టిన ముహుర్తానికే ప్రారంభించామని ప్రకటిస్తూ, నటసింహానికి థ్యాంక్స్ చెప్పాడు.