My title

దేశానికి పనిచేసే ప్రధాని కావాలి

బిఎస్పీ అధినేత్రి మాయావ‌తి బిజెపిని టార్గెట్ చేశారు. ఇటీవ‌ల పార్టీ చీఫ్ అమిత్ షా అమేథీలో ప‌ర్య‌టిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌ను మాయావ‌తి చీల్చి చెండాడారు. గుజ‌రాత్ రాష్ట్రం దేశానికి ఒక మాట్లాడే ప్ర‌ధానిని అందించింద‌ని అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.

మోడీ వ‌ట్టి మాట‌ల మ‌నిషేన‌ని ఇప్ప‌టికైనా అమిత్ షా ఒప్పుకోవ‌డం చాలా సంతోష‌మ‌ని మాయావ‌తి అన్నారు. దేశానికి మాట‌ల మ‌నిషి కాద‌ని చేత‌ల మ‌నిషి అవ‌స‌ర‌మ‌ని ఆమె వ్యాఖ్యానించారు.

దేశంలో అనేక స‌మ‌స్య‌లున్నాయ‌ని వాటిని కేంద్రం పరిష్క‌రించ‌డం లేద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెరుగుతున్న ధ‌ర‌ల‌ను అదుపు చేయ‌డంలో మోడీ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మ‌యింద‌ని ఆమె విమ‌ర్శించారు. అదే విధంగా దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు తీవ్ర స‌మ‌స్య‌గా మారుతోంద‌ని ఆమె గుర్తుచేశారు. ఆరోగ్య‌రంగాన్నికూడా మోడీ ప్ర‌భుత్వం పూర్తి నిర్ల‌క్ష్యం చేసింద‌ని మాయావ‌తి విమ‌ర్శించారు.

ప్ర‌భుత్వ యంత్రాగాన్ని స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు ఎలా ఉప‌యోగించుకోవాలో మోడీకి బాగా తెలుసున‌ని ఆమె ఎద్దేవా చేశారు. మోడీకి ఇత‌రుల అభిప్రాయ‌ల‌ను గౌర‌వించే అల‌వాటు లేద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.

ప‌నిలో ప‌నిగా ఆమె ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను కూడా ఎండ‌గ‌ట్టారు. యోగి ఆదిత్యనాథ్ ప్ర‌భుత్వం కేవ‌లం స‌మీక్ష‌ల‌తో కాల‌యాప‌న చేస్తుందే త‌ప్ప …ప్ర‌జ‌ల‌కు మేలు క‌లిగే ప‌నులు చేయ‌డం లేద‌ని ఆమె విమ‌ర్శించారు.

ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న అనేక స‌మ‌స్య‌ల‌పై యోగి ప్ర‌భుత్వం దృష్టి సారించ‌డం లేద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతోంద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.