My title

మరో ముూవీతో మోహన్ లాల్ రెడీ…  

పరభాషా నటులకు ఒక్క హిట్ వచ్చిందంటే చాలు.. వాళ్ల గత సినిమాలన్నీ డబ్బింగ్ రూపంలో క్యూ కడతాయి. గతంలో ఎంతోమంది తమిళ హీరోల విషయంలో ఇదే జరిగింది.  ఇప్పుడు మోహన్ లాల్ విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. జనతా గ్యారేజ్ సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు మోహన్ లాల్. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు చాలామంది నిర్మాతలు… మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమాల్ని వరుసగా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈమధ్య విడుదలైన మన్యంపులి సినిమా తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో మోహన్ లాల్ హవా ఇంకాస్త పెరిగింది.

ఇదే హీట్ లో మోహన్ లాల్ నటించిన ఒప్పం సినిమా తెలుగులోకి వచ్చేస్తోంది. దీనికి తెలుగులో కనుపాప అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిజానికి ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో శివరాజ్ కుమార్ రీమేక్ చేయబోతున్నారు. కానీ తెలుగులో మాత్రం డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రియదర్శన్ డైరక్ట్ చేసిన ఈ సినిమా మలయాళంలో 50కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 − 1 =