My title

మరింత క్లారిటీ ఇచ్చిన స్పైడర్

స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. దసరాకు వస్తున్నామంటూ మహేష్ బాబు నెల రోజుల కిందటే ట్వీట్ చేశాడు. కానీ ఎవరూ నమ్మలేదు. దీనికి కారణం ఆ సినిమా షూటింగ్ పూర్తికాకపోవడమే. అయితే ఈ వ్యవహారంపై మరోసారి మేకర్స్ స్పష్టత ఇచ్చారు. స్పైడర్ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా బరిలోకి తీసుకొస్తామంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 27న స్పైడర్ సినిమా వచ్చి తీరుకుంది.

సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ రాబోతోంది. ఇక సెప్టెంబర్ 29న బాలయ్య-పూరి కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా రానుంది. సో.. ఈ రెండు సినిమాల మధ్యలో స్పైడర్ ను విడుదల చేయరని అంతా భావించారు. కానీ మహేష్ మాత్రం తగ్గలేదు. స్పైడర్ సినిమాను రిలీజ్ చేసేందుకే రెడీ అవుతున్నాడు. దీనికి రెండు బలమైన కారణాలున్నాయి.

మొదటి కారణం ఏంటంటే.. సెప్టెంబర్ 27న స్పైడర్ ను తమిళనాట కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ పనులు పూర్తిచేశారు. అక్కడ రిలీజ్ చేసి, తెలుగులో విడుదల చేయకపోతే బజ్ తగ్గిపోతుంది. ఇక రెండో కారణం ఏంటంటే.. సినిమా షూటింగ్ అప్పటికి కంప్లీట్ అయిపోతుంది. వీటితో పాటు దసరాకు వస్తామని ఆల్రెడీ చెప్పిన మహేష్ మాట తప్పినట్టు అవుతుంది. ఈ కారణాల దృష్ట్యా స్పైడర్ ను విడుదల చేయడానికి నిర్ణయించారు.