My title

సంక్రాంతికి షిఫ్ట్ అయిన పోటీ

లెక్కప్రకారం ఈ దసరాకు బాలయ్య, మహేష్ పోటీ పడాల్సి ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న పైసా వసూల్ సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. దానికి 2 రోజుల ముందు స్పైడర్ సినిమాను తీసుకొస్తామని మహేష్ ప్రకటించాడు. కానీ అనుకోని కారణాల వల్ల సెప్టెంబర్ 1కే వస్తోంది పైసా వసూల్. అలా బాలయ్య, మహేష్ మధ్య దసరా వార్ మిస్ అయింది.

అయితే దసరా వార్ మిస్ అయినా సంక్రాంతి వార్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ మూవీ షూటింగ్ ఈమధ్యే ప్రారంభమైంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్. అటు మహేష్ కూడా కొరటాల దర్శకత్వంలో చేస్తున్న భరత్ అనే నేను సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించాడు.

సో.. ఈసారి  బాలయ్య, మహేష్ మధ్య సంక్రాంతి వార్ ఫిక్స్ అయిందన్నమాట. మరోవైపు చరణ్ నటిస్తున్న రంగస్థలం సినిమాను కూడా సంక్రాంతికే అని ప్రకటించినప్పటికీ కాస్త ముందే వచ్చే అవకాశాలున్నాయి.