My title

డబ్బింగ్ స్టార్ట్ చేసిన మహేష్

ఒక పాట మినహా స్పైడర్ షూటింగ్ కంప్లీట్ అయింది. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బింగ్ థియేటర్ లోకి ఎంటరయ్యాడు మహేష్. అయితే ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. ప్రతి సినిమాకు మహేష్ డబ్బింగ్ చెప్పుకుంటాడు. దాన్ని ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్పైడర్ విషయంలో మాత్రం కాస్త స్పెషల్ గా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒకేసారి అటు తమిళ్, ఇటు తెలుగులో డబ్బింగ్ చెబుతూ చెమటోడుస్తున్నాడు మహేష్.

స్పైడర్ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతోనే కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు మహేష్. అందుకే తమిళ స్పైడర్ డబ్బింగ్ పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు మహేష్. స్వతహాగా తమిళుడైన మురుగదాస్ పర్యవేక్షణలో తమిళ వెర్షన్ డబ్బింగ్ చెబుతున్నాడు. ఒక్కో డైలాగ్ ను పర్ ఫెక్షన్ కోసం ఒకటికి పది సార్లు చెబుతున్నాడట మహేష్. సేమ్ టైం తెలుగు డబ్బింగ్ ను మాత్రం చకచకా పూర్తిచేస్తున్నాడట.

దసరా కానుకగా సెప్టెంబర్ 27న స్పైడర్ సినిమా విడుదలకానుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే బూమ్ బూమ్ అంటూ ఓ సింగిల్ రిలీజ్ కాగా.. త్వరలోనే రేపు సినిమాకు సంబంధించి మరో టీజర్ ను విడుదల చేయబోతున్నారు.