My title

“స్పైడర్” మూవీ టెలివిజన్ రైట్స్ ని సొంతం చేసుకున్న సన్ నెట్ వర్క్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న మూవీ “స్పైడర్” పై ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి తెలుగు లో ఎంత క్రేజ్ అయితే ఉందో తమిళ్ లో కూడా అంతకు మించి క్రేజ్ ఉంది ఈ మూవీకి. ఎందుకంటే తమిళ్ లో మురగదాస్ స్టార్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే. అలాగే మహేష్ బాబు తమిళంలోకి అధికారికంగా లాంచ్ అవుతున్న చిత్రం కావడం, తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా రూపొందటంతో ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ మూవీ కి ఉన్న క్రేజ్ వలన తమిళ బిజినెస్ కూడా మంచి డిమాండ్ గా  జరుగుతోంది అని టాక్. అదే విధంగా తమిళ వెర్షన్ టెలివిజన్ హక్కుల్ని ప్రముఖ టీవీ ఛానెల్ సన్ టీవీ దక్కించుకుంది. ఎంతకి కొన్నారు అనేది బయటకి రాలేదు కాని భారీ స్థాయిలోనే బిసినెస్ జరిగింది అనేది అర్ధం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న అటు తెలుగులోనూ ఇటు తమిళ్ లోనూ  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు టీం. అలాగే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 15 వ తేదీన శిల్పకలావేదికలో చేయబోతున్నారు మూవీ యూనిట్.