My title

మహేష్ బాబు కోసం మరో భారీ సెట్

కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ అసెంబ్లీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు మహేష్ బాబు కోసం మరో సెట్ కూడా రెడీ అవుతోంది. ఇది కూడా అన్నపూర్ణ స్టుడియోస్ లోనే సిద్ధమౌతోంది. 2 రోజుల నుంచి కడుతున్న ఈ సెట్.. సినిమాకు చాలా కీలకం అంటున్నారు.

భరత్ అనే నేను సినిమాలో కీలకమైన ఫైట్ కోసం ఈ సెట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు. ఆ టూర్ ముగిసిన వెంటనే ఈ కొత్త సెట్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం.. 16వ తేదీ నుంచి మహేష్ సెట్స్ పైకి వస్తాడని తెలుస్తోంది. కానీ అంతకంటే ఇంకాస్త ఎక్కువే మహేష్ గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు.

మహేష్ నటించిన స్పైడర్ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు మహేష్. సో.. ఈసారి కూడా కనీసం 2 నెలలు గ్యాప్ తీసుకుంటాడనే ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటికే సినిమా స్టార్ట్ అయింది కాబట్టి గ్యాప్ ఇవ్వకపోవచ్చనే మరో వాదన కూడా వినిపిస్తోంది.