My title

రేపే మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభం

ఇప్పటికే ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఇంతలోనే మరో సినిమా ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును.. మీ ఆశ్చర్యం నిజమే.. మహేష్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. కుదిరితే 2 సినిమాల్ని ఒకేసారి పూర్తిచేసే ప్లాన్ కూడా రెడీ చేశాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో కొత్త సినిమాను రేపు ప్రారంభించబోతున్నాడు మహేష్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు రేపు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. వంశీ పైడిపల్లి-మహేష్ కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కాగా.. మహేష్ కు కెరీర్ లో ఇది 25వ చిత్రం కావడం స్పెషల్ హైలెట్.

నిజానికి వంశీ పైడిపల్లికి ఎప్పుడో అవకాశం ఇవ్వాలనుకున్నాడు మహేష్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఖలేజా సినిమా కంటే ముందే వంశీ పైడిపల్లితో సినిమా చేయాలి. కానీ స్టోరీలైన్ సెట్ కాక కాంబినేషన్ కుదరలేదు. ఎట్టకేలకు మహేష్ కోసం అదిరిపోయే కథ సిద్ధంచేశాడు పైడిపల్లి. కథతో పాటు టోటల్ స్క్రీన్ ప్లే కూడా చెప్పేశాడు. ఈ లైన్ బాగా నచ్చడంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పేశాడు మహేష్.

ఇక బ్యానర్ విషయానికొస్తే ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై చేయాలనుకున్నాడు మహేష్. కాకపోతే దిల్ రాజు, అశ్వనీదత్ కు చాలా ఏళ్ల కిందటే మాటివ్వడంతో వాళ్లిద్దరికీ జాయింట్ గా ఈ సినిమా చేసి పెడుతున్నాడు.