My title

సెప్టెంబర్ 16న “మ‌హ‌నుభావుడు” ఆడియో రిలీజ్

శ‌ర్వానంద్ హీరోగా,  మెహ్రీన్ హీరోయిన్ గా,  మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు చిత్ర షూటింగ్ ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది.  ఇదిలా ఉంటే… మహానుభావుడు ఆడియో ను సెప్టెబర్ 16న విడుదల చేయనున్నారు.

వోసీడీ అనే మానసిక వ్యాథితో బాధపడేలా హీరోను ఇందులో చూపించారు. ఇందులో హీరోకు అతిశుభ్రత ఉంటుందన్నమాట. చివరికి హీరోయిన్ ను ముద్దాడాలన్నా కూడా బ్రష్ చేశావా అని అడుగుతుంటాడు. ఇలాంటి మానసిక లోపంతో ఉన్న పాత్రలో శర్వానంద్ అద్భుతంగా నటించాడని అంటోంది యూనిట్. గతంలో భలేభలే మగాడివోయ్ సినిమాలో నానిని మతిమరుపు వ్యక్తిగా చూపించిన మారుతి, ఈ సినిమాలో శర్వాకు ఈ వీక్ నెస్ అంటగట్టాడన్నమాట.

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మి కి చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతమందించాడు. ఈ చిత్రం మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా  వుంటుంది.