My title

విశాఖ‌లో బిగ్ పొలిటిక‌ల్ ఫైట్‌…. మ‌హాధ‌ర్నా వ‌ర్సెస్ సంక‌ల్ప‌ దీక్ష‌

సాగ‌ర‌తీరంలో రాజ‌కీయ స‌మ‌రం వేడెక్కింది. భూకుంభ‌కోణం రాజకీయం ముదిరింది. భూఆక్రమణలపై వైసీపీ పోరుబాట ప‌ట్టింది. ఇప్ప‌టికే అఖిల‌ప‌క్ష స‌మావేశం, రౌండ్‌టేబుల్ మీటింగ్‌లు, స్థ‌లాల పరిశీల‌న‌తో ఆందోళ‌న‌లు నిర్వ‌హించింది. విశాఖ భూ కుంభ‌కోణంపై ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు జూన్ 22 న విశాఖ‌లో మ‌హాధ‌ర్నా నిర్వ‌హిస్తోంది. ఈ ధ‌ర్నాకు వైసీపీ అధినేత జ‌గ‌న్ హాజ‌ర‌వుతున్నారు. దీంతో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది.  వైసీపీ మ‌హాధ‌ర్నాతో మేల్కొన్న టీడీపీ పోటీగా మ‌హాసంక‌ల్పం పేరుతో టీడీపీ ధ‌ర్నా నిర్వ‌హిస్తోంది.

ప్రత్యేక హోదా ఉద్యమం కోసం జగన్ గతంలో విశాఖకు వచ్చిన టైమ్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ సారి విశాఖ జ‌గ‌న్ ధ‌ర్నా జ‌నాల్లో అటెన్ష‌న్ పెంచింది. వైసీపీ ధ‌ర్నాకు చెక్ చెప్పేందుకు టీడీపీ శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌ను సృష్టించేందుకు ప్లాన్‌లు చేస్తోంది. మ‌రోవైపు భారీ జ‌న‌స‌మీక‌ర‌ణ‌తో మ‌హాధ‌ర్నాను విజ‌య‌వంతం చేసేందుకు వైసీపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు విశాఖ‌లో మ‌కాం వేసి స‌భ‌, జ‌న‌సమీక‌ర‌ణ ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పోటాపోటీ ధ‌ర్నాల‌తో విశాఖ‌లో రాజకీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. దీంతో ఈ రెండు ధ‌ర్నాల‌కు అనుమ‌తులు వ‌స్తాయా?  లేదా అనేది స‌స్పెన్స్‌గా మారింది.