My title

“మగధీర-2” రాబోతుంది….

“మగధీర” రామచరణ్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అని ఖరాఖండి గా చెప్పొచ్చు. అలాగే తెలుగు ప్రేక్షకులకి కూడా “మగధీర” అంటే ఎనలేని అభిమానం ఉంది. ఎందుకంటే ఆ మూవీ లో ఉండే మేజిక్ అలాంటింది. అసలు 2009 లో “మగధీర” అనే మూవీ ఒక సంచలనం. జనాలు అయితే అప్పట్లో దిన్ని ఒక విసువల్ వండర్ గా భావించారు. అయితే ఇప్పుడు అలాంటి క్లాసిక్ మూవీ కి సీక్వెల్ రూపొందించే పనులు జరుగుతున్నాయి అని టాక్ వినిపిస్తుంది. ఆ సీక్వెల్ కోసం విజయేంద్ర ప్రసాద్ ఒక కథ కూడా రాస్తున్నారని అన్నారు. ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం అలాంటిదేం లేదని అన్న ఆయన ఎప్పటికైనా చిరంజీవి, రామ్ చరణ్ లతో ‘మగధీర-2’ రూపొందాలని, దానికి తానే కథను రాయాలని, ఆ కథను తన కుమారుడు రాజమౌళియే డైరెక్ట్ చేయాలనేది ఆయన కోరికని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. మరి ఆయన కల ప్రస్తుతానికి ఎంతో మంది అభిమానులకి మళ్ళీ “మగధీర-2” వస్తే బాగుండు అనే ఆలోచనని తీసుకొచ్చింది. ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ అన్నట్టు గానే “మగధీర-2” స్టార్ట్ అయితే సౌత్ ఇండియన్ సినిమా లోనే అది మరో సంచలనంగా మారుతుంది. మరి విజయేంద్ర ప్రసాద్ అన్న ఈ మాటల గురించి రాజమౌళి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.