My title

‘లై’ మూవీ రివ్యూ

రివ్యూ: లై

రేటింగ్‌:   2.25/5

తారాగణం:   నితిన్‌, మేఘా ఆకాశ్‌, అర్జున్‌, శ్రీకాంత్‌, రవి కిషన్‌ తదిత‌రులు

సంగీతం:    మణిశర్మ

నిర్మాత:    రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనీల్‌ సుంకర, వెంకట్‌ బోయనపల్లి

దర్శకత్వం: హనూ రాఘవపూడి

టాలీవుడ్ లో ఇంటెలిజెంట్ మూవీ పేరుతో తీసే సినిమాలు చూస్తే ఒక అనుమానం రాక మానదు. మనవాళ్ళకు హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు లేదు అనుకుంటున్నారో లేక ఇంటర్ స్టెల్లార్ లాంటి అర్థం కాని సినిమాలు కూడా హైదరాబాద్ లో వంద రోజులు ఆడాయి కదా అని తప్పుడు లెక్కలు వేసుకున్నారో కాని స్టైలిష్ మేకింగ్ పేరుతో మరీ సాగదీసిన సినిమా తీస్తే ఆదరిస్తారు అనే అంచనా వేసుకున్న సినిమా ఏది సక్సెస్ అయిన దాఖల ఇంతవరకు టాలీవుడ్ లో లేదు. సాక్షాత్తు మహేష్ బాబు 1 సినిమానే మొహమాటం లేకుండా తిప్పి కొట్టారు ప్రేక్షకులు. చాలా తెలివి ఉంటె తప్ప నా సినిమా అర్థం కాదు అని దర్శకుడు ఒక సందర్భంలో వెటకారంగా అన్నా  ప్రేక్షకుడు ఎప్పుడు తెలివైన వాడే అనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఒకే సంవత్సరం పెళ్లి చూపులు లాంటి సాఫ్ట్ ఫీల్ గుడ్ మూవీని, సరైనోడు లాంటి ఊర మాసు నాటు సినిమాని హిట్ చేసి పెట్టింది ఆ ప్రేక్షకుడే. సో అతని మీద పడి ఏడిస్తే నష్టం అన్నవాడికే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే లై సినిమా చూసాక మన మైండ్ లో ఇలాంటి ఆలోచనలే కలుగుతాయి.

లై క్యాప్షన్ గా లవ్ ఇంటలిజెన్స్ ఎనిమిటి అన్నారు. కాని ఈ మూడింటిలో ఏది సరిగ్గా కుదరలేదు. రెండు వేర్వేరు లక్ష్యాలతో అమెరికా వెళ్ళిన హీరో హీరొయిన్. అక్కడ లవ్ స్టొరీ స్టార్ట్. పోలీసులు వెతుకుతున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ అక్కడే ఉంటాడు. వాడిని పట్టుకోవడానికి మన అండర్ కవర్ ఆపరేషన్ మీద వచ్చిన హీరో రంగంలోకి దిగుతాడు. ఇది ఇంటలిజెన్స్ స్టొరీ. చిన్నప్పడు హీరో తండ్రిని అకారణంగా చంపి ఉంటాడు అదే విలన్. ఇది ఎనిమిటి స్టొరీ. మొత్తం త్రీ ఇన్ వన్ ఆఫర్ అన్నమాట. కాని మూడు సమపాళల్లో కుదిరిస్తే ఇది మాస్టర్ పీస్ అయ్యేది. కాని హను రాఘవాపూడి కెరీర్ లో మొదటిసారి అటెంప్ట్ చేసిన థ్రిల్లర్ మూవీని హ్యాండిల్ చేయటంలో తడబడటంతో అసలుకే మోసం వచ్చింది. ఇది సత్యం అనే నితిన్ పాత్రకు, పద్మనాభం అనే అర్జున్ పాత్రకు మధ్య జరిగే మైండ్ వార్. ఒకరు పట్టుకోవడానికి ఒకరు తప్పించుకోవడానికి. ఈ మధ్య జరిగే దోబూచులాటలే లై మూవీ.

కథ వింటే బాగానే ఉంది అనిపించే లై సబ్జెక్టుని హాలీవుడ్ రేంజ్ లో తీద్దామనే ప్రయత్నంలో హను రాఘవపూడి సగమే సక్సెస్ అయ్యాడు. చాలా థ్రిల్లింగ్ గా ఉండాల్సిన క్యాట్ అండ్ మౌస్ గేమ్ ని నిస్సారంగా మార్చేసాడు. అది స్క్రీన్ ప్లే లోపమే. విలన్ ని ఎలివేట్ చేసినంత శ్రద్ధగా హీరోను చెయకపోవడం లైలో ఉన్న ప్రధాన లోపం. పోనీ వాటిని ఆసక్తి రేపే యాక్షన్ ఎపిసోడ్స్ తో కవర్ చేసే మనల్ని థ్రిల్ చేసారా అంటే అదీ లేదు. హను రిస్క్ తీసుకోకుండా మూడు లైన్లలో ఉన్న స్టొరీ డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నా రిస్క్ తీసుకోకుండా లాగించడంతోటే అసలు సమస్య వచ్చింది. యువరాజ్ కెమెరా పనితనం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా వీక్ గా సీన్స్ ని కూడా ఎంగేజ్ చేసేలా చేసాయి. లేకపోతే ఓ రెండు మాటలు పోసిటివ్ గా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు.

నితిన్ బాగా చేసాడు నో డౌట్. ప్రేమ కథల చక్రంలో ఇరుక్కుపోకుండా ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఇలాంటి జానర్ మూవీ ని సెలెక్ట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం. తన వరకు కంప్లయింట్ కు అవకాశం లేని విధంగా నటించాడు. మేఘా ఆకాష్ న్యాచురల్ గా ఉంది. రోజు చూసే బబ్లీ గర్ల్ గా ఓకే అనిపించింది. విలన్ గా అర్జున్ అదరహో అనిపిస్తాడు. అర్జున్ కాకుండా ఇంకే రెగ్యులర్ విలన్ ఈ పాత్ర చేసినా సినిమా పూర్తవ్వడానికి గంట ముందే బయటికి రావాల్సి వచ్చేది. అంత ప్లస్ అయ్యాడు. కాని హను రాఘవాపూడి తను పూర్తిగా వాడుకోలేదు. చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో కనిపించిన తమిళ్ హీరో శ్రీరామ్ ఆ పాత్రకు సరిపోయాడు. నాజర్ పాత్ర రొటీన్. బ్రహ్మాజీ, పృథ్వి, రాజీవ్ కనకాల, పూర్ణిమ అంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వారే.

లై గురించి ఇప్పటికే చాలా చెప్పేసాం. ఇది ప్రకటనల్లో చెప్పుకున్నట్టు మరీ ఇంటెలిజెంట్ మూవీ మాత్రం కాదు. ఒక సాధారణ రివెంజ్ డ్రామాని స్టైలిష్ మేకింగ్ తో థ్రిల్లర్ లా మారుద్దామని  దర్శకుడు హను చేసిన ప్రయత్నం అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. హీరో లుక్ మార్చి, విలన్ గా సీనియర్ యాక్టర్ ని తీసుకుని. షూటింగ్ మొత్తం అమెరికా లో ప్లాన్ చేసి, మణిశర్మ లాంటి లెజెండ్ ని ఎంగేజ్ చేసి ఇవన్ని హను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు కాని అసలు కథ, కథనం విషయంలో తప్పులు చేయడంతో చాలా స్పెషల్ గా అనిపించాల్సిన మూవీ చప్పగా మిగిలిపోయింది. పైగా రిస్క్ తీసుకుని మరీ పెద్ద పోటీలో దిగటంతో సేఫ్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది

Also Read: