My title

ఏ సినిమా…. హిట్టో, ఫ్లాపో ఖచ్చితంగా చెప్పలేం

ఈ వీకెండ్ మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏ సినిమాకు క్లీన్ మెజారిటీ వచ్చిందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు క్రిటిక్స్. అంతేకాదు, భవిష్యత్తులో కూడా ఈ 3 సినిమాల్లో పెద్ద విజయం దేనిదనే విషయాన్ని చెప్పడం కష్టం అంటున్నారు. కనీసం ఈ 3 సినిమాలు హిట్టా.. లేక ఫ్లాపులా అనే విషయం కూడా చర్చించలేమంటున్నారు. అంతలా ఈ 3 సినిమాలకు సంబంధించిన మేకర్స్.. మసిపూసి మారేడుకాయ చేస్తున్నారట.

లై సినిమా థియేటర్లలోకి వచ్చింది. వీళ్లు బొంబాట్ బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేసుకుంటున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చింది. ట్రెమండస్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. జయ జానకి నాయక సినిమా వచ్చింది. యునానిమస్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకుంటున్నారు. పోనీ టాక్ పరంగా చూస్తే.. ఏ సినిమాకు పూర్తిగా హిట్ టాక్ రాలేదు. సగం మంది బాగుందంటే, సగం మంది బాగాలేదంటున్నారు.

పోనీ వసూళ్ల పరంగా సక్సెస్ ఏదో చూద్దామంటే.. ఆ యాంగిల్ లో కూడా మానిప్యులేషన్లు ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన వసూళ్లు వారు చెప్పుకుంటూ పోతున్నారు. అంతెందుకు, ఏ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలైందో కూడా ఖచ్చితంగా చెప్పడం లేదు. దీన్ని బట్టి మనం అర్థంచేసుకోవాల్సింది ఒక్కటే. ఈ మూడు సినిమాల రిజల్ట్ ఏంటనేది మరో వారంలో ప్రేక్షకులే తేలుస్తారు.