My title

జగన్‌ డబ్బులు ఇచ్చాడా?…. జగన్ మనస్తత్వం తెలిసే మాట్లాడుతున్నారా?

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రం వెనుక జగన్ ఉన్నారన్న  ఆరోపణలను ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఖండించారు. వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా ఉండడం కేవలం యాధృచ్చికమేనన్నారు. జగన్‌ మనస్తత్వం గురించి తెలిసిన వారెవరూ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనుక జగన్‌ ఉన్నారని ఆరోపించబోరని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు కూడా సినిమా వెనుక జగన్‌ ఉన్నారని చెప్పే పరిస్థితి లేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్‌ కొంచెం డబ్బు ఖర్చు పెట్టి ఉంటే గెలిచేవాళ్లమని పార్టీ నేతలమైన తామే బాధపడుతుంటామని ఒక చానల్ చర్చలో చమత్కరించారు.  మెన్నటి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి ఉంటే జగన్‌కు అధికారం వచ్చేదన్నారు. కానీ జగన్‌ మనస్తత్వం అలాంటిది కాదన్నారు. అలాంటి జగన్‌ ఇప్పుడు లక్ష్మీపార్వతి కోసమో, ఎన్టీఆర్‌ కోసమో కోట్లు పెట్టి సినిమా తీయిస్తున్నారంటే ఎవరు నమ్ముతారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌కు తాను దగ్గరైన సమయంలో ఆయన వద్ద డబ్బు లేదు, అధికారం లేదు, ఆరోగ్యం కూడా సరిగా లేదని గుర్తు చేశారు. తాను దగ్గరుండి ఆయన ఆరోగ్యం బాగు చేయించానన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తాను,ఎన్టీఆర్ ఇద్దరమే రాష్ట్రమంతా తిరిగి టీడీపీకి అఖండవిజయాన్ని అందించామన్నారు. ఆసమయంలో చంద్రబాబు ఏకంగా రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ రెండూ తీసుకున్నారని.. కానీ తాను ఒక్క పదవైనా తీసుకున్నానా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఆ రోజుల్లో ఈనాడు పత్రిక పనిగట్టుకుని తనపై తప్పుడు కథనాలు రాసిందన్నారు. ఎన్టీఆర్‌ కూడా ఈనాడు పత్రిక కథనాలను ఖండించారని ఆమె వివరించారు. చంద్రబాబుకు నిజంగా ప్రజాబలం ఉంటే ఇప్పుడైనా సరే ఎన్టీఆర్‌ ఫొటో లేకుండా ఎన్నికలకు వెళ్లి గెలవాలని లక్ష్మీపార్వతి సవాల్ చేశారు.