My title

హీరోయిన్ రాసి ఆశ‌ల‌న్నీ లంక పైనే..!

శుభాకాంక్ష‌లు చిత్రంతో  తెలుగు  తెర‌కు ప‌రిచ‌య‌మైన  అచ్చ తెలుగు అమ్మాయి రాసి. శుభాకాంక్ష‌లు సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డం.. గ్లామ‌ర్ తో పాటు… అభిన‌యం రెండు పుష్క‌లంగా ఉండ‌టంతో…   త్వ‌ర‌గానే  స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ త‌రువాత సిమ్రాన్.. స్నేహా..చార్మీ  .. లాంటి కొత్త బ్యూటీస్  మెర‌వ‌డంతో  రాసి సీనియ‌ర్ అయ్యింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు  కొత్త వారికే పెద్ద పీట వేస్తుంటారు. కెరీర్ ప‌రంగా  తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాపు 70 చిత్రాల‌కు పైగా రాసి న‌టించారు. తెలుగులో ఆమే.. ప్రేయ‌సి రావే వంటి చిత్రాలు న‌ట‌న ప‌రంగా  ఆమెకు  బాగా గుర్తింపు తెచ్చాయి.

కెరీర్ లో ఆఫ‌ర్స్ త‌గ్గిపోతున్నాయి అనుకున్న స‌మ‌యంలో  ద‌ర్శ‌కుడు శ్రీ‌ముని తో మ్యారేజ్ చేసుకుని సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంది. ప్ర‌స్తుతం  త‌ను లీడ్ రోల్ లో  త‌న భ‌ర్త ద‌ర్శ‌క‌త్వంలో  లంక పేరుతో సినిమా చేశారు. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ గా చేసిన ఈ చిత్రం శుక్ర‌వారం రిలీజ్ అవుతుంది. ప్ర‌చారం అంతంత మాత్రంగానే ఉంది.  మ‌రి ఇటు త‌న కెరీర్ కు ఒక బూస్ట్ రావాల‌న్న‌… త‌న భ‌ర్త శ్రీ‌ముని కి  కొన్ని ఆఫ‌ర్స్ రావాల‌న్నా..  లంక చిత్రం విజ‌యం  ఈ జంట‌కు  చాలా కీల‌కం అనే  చెప్పాలి. అస‌లే  ఒక వారంలో బాహుబ‌లి 2 రిలీజ్ కు ఉంది. ఆడియ‌న్స్ మూడు కూడా  బాహుబ‌లి ట్రాన్స్ లోకి వెళ్లింది. మ‌రి ఇటువంటి స‌మ‌యంలో  లంక  రిజ‌ల్ట్ ఏమౌతుందో చూడాల్సిందే. రిజ‌ల్ట్  ఎలా ఉన్న‌ప్ప‌టికి..  బాహుబ‌లి  2 రిలీజ్ అంటే థియేట‌ర్స్ ఆల్మోస్ట్ 95 ప‌ర్సెంట్    బాహు బ‌లి కి వెళ్లిపోతాయి . ఈ ఒక్క వారంలో   రిజ‌ల్ట్ పాజిటివ్ గా వ‌చ్చిన‌ప్ప‌టికి.. సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుందా  లేదా అనేది  ప్ర‌శ్న‌.!