My title

నితీష్ కుమార్ ఓ ఫేక్ సోష‌లిస్ట్‌

ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నితీష్ కుమార్ ఓ ఫేక్ సోష‌లిస్ట్ అని అభివ‌ర్ణించారు. నితీష్ కుమార్ మ‌త‌శ‌క్తుల‌కు జ‌డిసి వారితో జ‌త క‌ట్టార‌ని లాలూ విమ‌ర్శించారు.

నిజ‌మైన సోష‌లిస్టు మ‌త శ‌క్తుల‌కు భ‌య‌ప‌డ‌డ‌ని, అటువంటి వారితో చేతులు క‌ల‌ప‌డ‌ని లాలూ అన్నారు. అదే విధంగా నితీష్ కుమార్ హిట్ల‌ర్‌కు గాడ్సే కు వీరాభిమాని అని కూడా లాలూ చెప్పారు. ట్విట్ట‌ర్ ద్వారా లాలూ త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్‌జెడితో జ‌త‌క‌ట్టిన నితీష్ కుమార్ అధికారం హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్‌జేడీ క‌న్నా నితీష్ కుమార్‌కి త‌క్కువ సీట్లు వ‌చ్చినా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకోగ‌లిగారు. లాలూ త‌న‌యుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

కొన్ని నెల‌ల‌కే సీన్ రివ‌ర్స్ అయింది. జూలైలో నితీష్ కుమార్ ఆర్‌జీడీకి గుడ్‌బై చెప్పారు. బిజెపితో తిరిగి జ‌త‌క‌ట్టారు. దీంతో లాలూ నితీష్ పై ఆగ్ర‌హంగా ఉన్నారు.