My title

జగన్‌ అలా అనుకుంటే మూర్ఖత్వమే

వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కొత్తపల్లి గీతకు ఈ మధ్య టీడీపీతోనూ పొసగడం లేదు. గిరిజన సలహా మండలిలో స్థానం దక్కకపోవడంతో చంద్రబాబు గిరిజనులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు టీడీపీతో ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. ఇప్పుడు వైసీపీని కూడా అదే రేంజ్‌లో తిడుతున్నారు కొత్తపల్లి గీత. జగన్ పాదయాత్రపై స్పందించిన ఆమె… పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు అయిపోతారా అని ప్రశ్నించారు. అలా అనుకుంటే అది జగన్‌ మూర్ఖత్వమేనని వ్యాఖ్యానించారు.

జగన్ యాత్ర ఒక పొలిటికల్ స్టంట్‌గా అభివర్ణించారు. ప్రత్యేక హోదా అన్నది ప్రజలను మభ్యపెట్టేందుకు ఇచ్చిన వాగ్దానం మాత్రమేనన్నారు. అదో ముగిసిన అధ్యాయమన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న విషయం అప్పటి నేతలకు, ఇప్పటి నేతలకు ముందే తెలుసన్నారు.  వైసీపీ ఎంపీల రాజీనామాపై ఆ పార్టీ మూడేళ్లుగా మాట్లాడుతోందని కొత్తపల్లి గీత ఎద్దేవా చేశారు. ఒక వేళ నిజంగా ఎంపీల చేత రాజీనామా చేయిస్తే అప్పుడు దానిపై తాను స్పందిస్తానన్నారామె.