My title

న‌ల్గొండ బ‌రిలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌…. గులాబీ సేన‌లో జోరుగా ప్ర‌చారం

తెలంగాణ రాజకీయాల్లో న‌ల్గొండ ఉప ఎన్నిక ప్ర‌చారం జోరందుకుంది. న‌ల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి రాజీనామా చేస్తార‌ని లీక్‌ల మీద లీకులు వ‌స్తున్నాయి. గుత్తాకు రైతు స‌మాఖ్య రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే మ‌రీ టీఆర్ఎస్ త‌ర‌పున ఎవ‌రు పోటీ చేస్తార‌నే విష‌యంపై ప‌లు పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ. అయితే ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డానికి ఆయ‌న ఇంట్ర‌స్ట్ చూప‌డం లేద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం సీటు నుంచి పోటీ చేస్తాన‌ని ఆయ‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఖ‌మ్మం వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న కొత్త‌గూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ప్ర‌స్తుత అక్క‌డి ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు ఈసారి హైద‌రాబాద్‌లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. దీంతో న‌ల్గొండ ఎంపీ బ‌రిలో కోమ‌టిరెడ్డి సోద‌రుల్లో ఎవ‌రో ఒక‌రు పోటీ చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం ఊపందుకుంది.

గ‌త ఏడాదిగా గులాబీబాస్‌తో కోమ‌టిరెడ్డి సోద‌రులు ట‌చ్‌లో ఉన్నార‌నే తెలుస్తోంది. కోమ‌టిరెడ్డి సోద‌రుల్లో ఒకరైన మోహన్ రెడ్డికి  కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్ కేంద్ర కార్మిక‌శాఖ‌మంత్రిగా ప‌నిచేసిన రోజుల్లో ఆయ‌న ద‌గ్గ‌ర మోహ‌న్‌రెడ్డి ప‌నిచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈయ‌న‌కు ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ చూశార‌ట‌. అయితే త‌న బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయ భ‌విష్య‌త్ దృష్ట్యా ఆయ‌న అప్పుడు ఆ ప‌ద‌వి తిర‌స్క‌రించార‌ని తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్‌తో ఉన్న రిలేష‌న్‌తో ఇప్పుడు కోమ‌టిరెడ్డి సోద‌రులు టీఆర్ఎస్‌లోకి వెళ‌తారని ప్ర‌చారం న‌డుస్తోంది.

మ‌రోవైపు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ను మార్చే అవ‌కాశం లేద‌ని తేల‌డంతో పార్టీ మార‌డమే ఉత్త‌మ‌మ‌ని కోమ‌టిరెడ్డి సోద‌రులు అనుకుంటున్నార‌ట‌. ఇటు బీజేపీ నుంచి ముఖ్య‌ప‌ద‌విపై హామీ రాక‌పోవ‌డంతో క‌మలంలో చేరే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి ద‌స‌రా త‌ర్వాత తెలంగాణ రాజకీయాల్లో ప‌లు మార్పులు వ‌చ్చే అవ‌కాశం క‌న్పిస్తోంది.