My title

నా భర్త నాకు కావాలి-రంభ

ఒకప్పుడు యూత్‌ను ఉర్రూతలూగించిన హీరోయిన్ రంభ వైవాహిక జీవితం చిక్కుల్లో పడింది. ఇప్పుడు తన భర్తతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలంటూ ఆమె చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్‌ను రంభ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది . పెళ్లి తర్వాత ఆమె భర్తతో కలిసి టోరంటో వెళ్లి పోయింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొద్దినెలలుగా విడివిడిగా ఉంటున్నారు. రంభ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈనేపథ్యంలో హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తనకు హక్కులు కల్పించి భర్తతో కలిసి ఉండే అవకాశం కల్పించాలని ఆమె కోర్టును కోరారు. డిసెంబర్‌3న కేసు విచారణకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ చిత్రాల్లో మొత్తం 100కు పైగా చిత్రాల్లో రంభ నటించారు. 1990, 2000 దశకంలో రంభ శకం నడిచింది.

Also Read:

kurnool-yuva-bheri-sudharani  ys-vivekananda-reddy

butta-renuka  ys-jagan

Leave a Reply

Your email address will not be published.

4 × three =