My title

మహేష్ బాబు సినిమాకు హీరోయిన్ ఫిక్స్

త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామంది పేర్లు పరిశీలించాయి. మరీ ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, సమంత, శృతిహాసన్ పేర్లు హెవీగా వినిపించాయి. అయితే ఫైనల్ గా ఎవరూ ఊహించని ఓ కొత్తమ్మాయిని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు కొరటాల శివ. ఆ అమ్మాయి పేరు కైరాా అద్వానీ.

అవును.. మహేష్ బాబు సినిమాలో అతడి సరసన కైరా మెరవనుంది. ఈ మేరకు డీల్ పై సంతకం చేసింది కైరా. ఈమెనే తీసుకోవడానికి ముఖ్యంగా రెండు రీజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్ బాబు సినిమాకు ఎలాంటి కాల్షీట్ల సమస్య ఉండకూడదు. అందుకే ప్రస్తుతం ఫ్రీగా ఉన్న కైరాతో ఎగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక రెండో రీజన్ ఏంటంటే.. కథ ప్రకారం మహేష్ సరసన కొత్తమ్మాయి అయితే బాగుంటుుంది.. మరీ ముఖ్యంగా ఎన్నారై ఛాయలుండే అమ్మాయి అయితే బెటర్. ఈ లక్షణాలన్నీ కైరాలో పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్నాడు మహేష్. వచ్చేనెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ అయిపోతుంది. ఆ వెంటనే కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని.. కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు మహేష్. ఈ సినిమాకు భరత్ అను నేను అనే టైటిల్ ఫిక్స్ చేశారు.