My title

ఖైదీ వేటకు… బహుబలి రికార్డు బద్ధలు

9 ఏళ్ల భారీ గ్యాప్ తర్వాత ఖైదీగా మనముందుకొచ్చిన చిరంజీవి… తనలో ఏమాత్రం స్టామినా తగ్గలేదని ఆన్ స్క్రీన్ నిరూపించుకున్నాడు. దీంతో పాటు తన మాార్కెట్ వాల్యూ కూడా అస్సలు తగ్గలేదని కలెక్షన్లతో ప్రూవ్ చేసుకుంటున్నాడు చిరంజీవి. తొలిరోజు ప్రీమియర్స్ ద్వారా ఇప్పటికే 39కోట్ల రూపాయలు వసూలు చేసిన ఖైదీ నంబర్ 150 సినిమా… ఇటు నైజాాం, అటు ఓవర్సీస్ తో కాసుల వర్షం కురిపిస్తోంది.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధించిన ఖైదీ నంబర్ 150 ఒక్క రోజులో 39 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్ను దాటి కొత్త చరిత్ర సృష్టించాడు చిరు. తొమ్మిదేళ్ల విరామం తరువాత కూడా బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న చిరు స్టామినా చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  మెగాస్టార్ కు ఎప్పటి నుంచో మంచి పట్టున్న నైజాంలో కాసుల వర్షం కురిసింది.

ఒకానొక టైమ్ లో తన సినిమాలకు సంబంధించి రెమ్యూనరేషన్ కింద నైజాం రైట్స్ కూడా తీసుకునేవాడు చిరంజీవి. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత అదే నైజాంలో రికార్డులు  షూరూ చేశాడు చిరంజీవి. ఖైదీ నంబర్ 150 సినిమా నైజాంలో మొదటి రోజే 4.87 కోట్ల రూపాాయలు వసూలు చేసింది. యూఎస్ లో ఏకంగా రూ.8. 56 కోట్లను వసూలు చేసింది.  ఈ వీకెండ్ కు ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధిస్తుందని అంచనా. మొత్తం మీద మెగా రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తుండడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. శాతకర్ణి సినిమా ఏ రేంజ్లో వసూళ్లు చేస్తుందో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × one =