My title

కాటమరాయుడు రివ్యూ

టైటిల్ : కాటమరాయుడు
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : పవన్ కళ్యాణ్, శృతిహాసన్, అలీ, తరుణ్ అరోరా, నాజర్
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ)
నిర్మాత : శరత్ మరార్
Rating: 2.25/5

సర్దార్ గబ్బర్ సింగ్ భారీ లాస్ లు రావడం తో కొత్త సినిమా కాటమరాయుడు మీద ఎవ్వరూ పెద్ద అంచనాలు కూడా పెట్టుకోలేదు. అయినా తనదైన శైలి లో ఎస్ జే సూర్య ని డైరెక్టర్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ తమిళ చిత్రం వీరం కి మార్పులు చేర్పులు చేసి షూట్ చేయాలని ప్లాన్ చేసాడు. కానీ సడన్ గా సూర్య హ్యాండ్ ఇవ్వడం తో డాలీ కి డైరెక్షన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, టీజర్ తోనే అందరిలో ఆసక్తి పెంచేసాడు.అప్పటి వరకూ లేని ఆశలు టీజర్ నుంచీ మొదలు అయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిన ఈ చిత్రానికి సంబంధించి విశేషాలు తెలుసుకుందాం.
రాయలసీమ లోని కర్నూలు జిల్లా మండలం లో కాటమరాయుడు ఆసామి .. ఆ ప్రాంతం లో జనాల నోట్లో నాలిక లా ఉంటూ అన్యాయం చేసిన‌వారి బెండు తీస్తూ ఉంటాడు. ఒక రకంగా పంచాయతీలు పెట్టి సెటిల్ చెయ్యకపోయినా పెదరాయుడు టైపు. అతనికి తన తమ్ముళ్ళు అంటే పంచ ప్రాణాలు, తమ్ముళ్ళ మీద ప్రేమ ఎంతుందో అమ్మాయిల మీద అసహ్యం కూడా రాయుడు కి అంతే రేంజ్ లో ఉంటుంది. చిన్న తనం లో తాను ఇష్టపడిన అమ్మాయి తనని వదిలి వెళ్ళిపోయింది అన్న బాధతో అమ్మాయిల మీద విరక్తి చెందిన మనోడు తమ్ముళ్ళని కూడా అలాగే పెంచుతాడు. అన్నకి పెళ్లి చేస్తే కానీ తమ తమ గర్ల్ ఫ్రెండ్స్ ని తాము పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి అన్నయ్య మీదకి అవంతి – శృతి హాసన్ ని ఉసి గోల్పుతారు తమ్ముళ్ళు. రకరకాల ప్రయత్నాల తరవాత మొత్తం మీద వారిద్దరూ ఒకటవుతారు. అవంతి కి హింస అన్నా, కొట్టు కోడాలూ, నరుక్కోడాలూ అన్నా భయం అని సైలెంట్ గా ఉంటాడు రాయుడు. తన గురించి తాను జనాలతో నడుచుకునే తీరు గురించి చెప్పని రాయుడు ఆమె కి ఒక సందర్భం లో విపరీతమైన హింస చేస్తూ దొరుకుతాడు. అక్కడితో ఇంటర్వెల్ పడుతుంది. అతని నిజ స్వరూపం తెల్సుకున్న ఆమె ఖంగు తిని ఇక తనని వదిలెయ్యమని బతిమాలుతుంది. సెకండ్ హాఫ్ లో ఆమె ప్రేమని పొందడం కోసం తమ్ముళ్ళతో సహా ఆమె ఇంట్లో చేరే హీరో .. ఆమె తండ్రి ఒక దుర్మార్గుడి తో పెట్టుకున్న వైరం గురించి తెలుసుకుని ఈ కుటుంబం చాలా పెద్ద ఆపదలో ఉంది అని తెలుసుకుని కాపాడే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఈ కుటుంబం తో ఇతను ఎలా కలిసాడు అనేది సినిమా ..

సినిమా మొత్తాన్నీ పవన్ కళ్యాణ్ తన బుజాల మీద మోసాడు . వీరం తమిళ చిత్రం అయినా అక్కడి సీన్ లు చాలా వరకూ తీసేసాడు డైరెక్టర్ డాలీ , థీమ్ మాత్రం అందులోంచి తీసుకుని ఒక డబ్భై శాతం కథ , సీన్ లు సొంతగా రాసుకున్నాడు . అది ఫెచ్చింగ్ పాయింట్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇవ్వడం లో అనూప్ మళ్ళీ తన సత్తా చూపించాడు. మాస్ ఎలిమెంట్ లు బాగున్నాయి . ఇక మెయిన్ కథ చాలా రోటీన్ గా అనిపిస్తుంది. తమ్ముళ్ళ‌ కీ అన్నకీ మధ్యన ఎందుకు అంత ఆప్యాయత అనేది ఒక్కసీన్ కూడా పెట్టలేదు కానీ ఎవరో అమ్మాయి ని కాటంరాయుడు ప్రేమించాడు అంటూ చిన్ననాటి సీన్ లు పెట్టారు. లాజిక్ లు చాలా దారుణంగా మిస్ అయ్యారు డాలీ. కామెడీ అక్కడక్కడా పేలినా అద్భుతంగా ఏమీ లేదు. ఇతర తారాగణం బాగానే చేసారు. రన్ టైం తక్కవ ఉండడం కాస్త పాజిటివ్ విషయం. డైలాగ్స్ ఒక్కటి కూడా పేలలేదు. అన్నీ బోరింగ్ గా ఫార్స్ గా అనిపిస్తాయి. పవన్ లాక్కొచ్చినంత ఈజీ గా ఇతర నటీనటులు సినిమాని అందుకోలేక పోయారు అనిపిస్తుంది. సినిమా టోగ్రఫీ చాలా వీక్ గా ఉంది. సాంగ్స్ కూడా స్క్రీన్ మీద మరీ అపీలింగ్ గా ఏమీ లేవు.
మొత్తంగా చూస్తే .. ఒక రొటీన్ సినిమాకి పవన్ కళ్యాణ్ మార్క్ టచ్ ఇచ్చి వదిలితే అది కాటమరాయుడు సినిమా అవుతుంది. ఎన్నో డ్రాగ్ లు ఉన్నా లాజిక్ లు మిస్ అయినా .. మాస్ జనాలకి కావాల్సిన మాస్ ఎలిమెంట్ లూ .. పవన్ నటన ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకుని వెళ్ళాయి. రెవెన్యూ పరంగా చుట్టుపక్కల నెల రోజులకి అటూ ఇటూ పెద్ద సినిమాలు లేకపోవడమ కాటమరాయుడు కి కలిసోచ్చే విషయం.

-ప్రజ్ఞా