My title

మహేష్ బాబు కి అడ్డుగా మారిన తమిళ హీరో….

మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ “స్పైడర్”. ఈ మూవీ ప్రస్తుతం తెలుగు తమిళ బాషల్లో రిలీజ్ కి రెడీ గా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జే సూర్య విలన్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగిందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు మూవీ యూనిట్. దసరాకి విడుదల అవుతున్న ఈ సినిమా కలెక్షన్ సునామి సృష్టిస్తుంది అని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే తెలుగు లో శర్వానంద్ నటించిన “మహానుభావుడు” సినిమా  తప్ప మహేష్ సినిమాకి మరే సినిమా ఎదురులేదు మహేష్ కి.

కానీ మహేష్ “స్పైడర్” కి తమిళ్ లో ఒక హీరో అడ్డుపడుతున్నాడు. అతను మరెవరో కాదు విజయ్ సేతుపతి. అవును తమిళ స్టార్ హీరో గా ఎదుగుతున్న విజయ్ సేతుపతి నటించిన “కరుప్పాన్”  అనే సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. విజయ్ సేతుపతి సినిమాలకి తమిళంలో పెద్ద మార్కెట్ ఉంది. దాంతో “స్పైడర్” సినిమా రెండు రోజులకే “కరుప్పన్” సినిమా కోసం థియేటర్స్ ఖాళీ చేయవలసి వస్తుంది అంట. విజయ్ సేతుపతి సినిమా విడుదల తేది ఫిక్స్ చేయడంతో తమిళ స్పైడర్ పంపిణిదారులకి భయం మొదలైంది అనే టాక్ వినిపిస్తుంది.