My title

రూటు మార‌నున్న కాపు ఉద్య‌మం…. మ‌రాఠాల త‌ర‌హాలో ఇక నిర‌స‌న‌లు

రిజ‌ర్వేష‌న్ల కోసం కాపులు చేప‌ట్టిన ఉద్య‌మం ఇక తీవ్రం కాబోతుంది. మ‌హారాష్ట్రలో రిజ‌ర్వేష‌న్ల కోసం మ‌రాఠాలు చేప‌ట్టిన ఉద్య‌మం త‌ర‌హాలో ఇక ఉద్య‌మించ‌నున్నారు. ముంబైలో శాంతియుత మౌన ప్ర‌ద‌ర్శ‌న‌లతో త‌మ డిమాండ్ల‌ను కొన్ని మ‌రాఠాలు నెర‌వేర్చుకున్నారు. దీంతో అదే త‌ర‌హాలో అమ‌రావ‌తిలో ఉద్య‌మించాల‌ని కాపులు నిర్ణ‌యించారు. తాత్కాలిక స‌చివాల‌యం ఉన్న వెల‌గ‌పూడి ప్రాంతంలో భారీ బహిరంగ‌స‌భ నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. లేక‌పోతే మ‌రాఠాల త‌ర‌హాలో రాష్ట్ర‌వ్యాప్తంగా స‌భ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత అమ‌రావ‌తిలో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాల‌ని అనుకుంటున్నారు. కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించే ప్ర‌స‌క్తే లేద‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌భుత్వానికి మ‌రాఠాల త‌ర‌హా ఆందోళ‌న‌తో జ‌వాబు ఇవ్వాల‌ని కాపు నేత‌లు నిర్ణ‌యించారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో ఈ అంశంపై చ‌ర్చించి త‌ర్వాత నిర్ణ‌యం ప్ర‌క‌టించాల‌ని కాపు నేతలు నిర్ణ‌యానికి వ‌చ్చారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ ఉద్య‌మాన్ని ఉధృతం చేయాల‌ని కాపు నేత‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.