My title

ఐలయ్య పుస్తకంపై సుప్రీం తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కంచె ఐలయ్య పుస్తకంపై సుప్రీం కోర్టు స్పందించింది. తమ కులాన్ని అవమానించేలా ఉన్న పుస్తకాన్ని వెంటనే నిషేధించాలంటూ ఆర్యవైశ్యసంఘం నేత వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పుస్తకాన్ని నిషేధించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పుస్తకాన్ని నిషేధించడం అంటే భావప్రకటన స్వేచ్చను అడ్డుకోవడమే అవుతుందని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుచెప్పింది. 

అదే సమయంలో పుస్తకాన్ని నిషేధించడం సాధ్యం కాదు గానీ… రచయిత స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. సుప్రీం తీర్పును ఐలయ్య స్వాగతించారు. తమపై ఒక పుస్తకం వచ్చినందుకు కోమట్లు గర్వించాలని సూచించారు. పుస్తకాన్ని నిషేధించడం అంటే భావప్రకటన స్వేచ్చను అడ్డుకోవడమేనన్న సుప్రీం తీర్పును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.