My title

కేథరిన్ థ్రెసాని రీప్లేస్ చేసిన కాజల్ అగర్వాల్

తమిళ్ హిట్ మూవీ అయిన “బోగన్” ను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ తెలుగు రీమేక్ లో ఇప్పటికే రవితేజ హీరో గా కన్ఫర్మ్ అయ్యాడు. అలాగే రవితేజ సరసన హీరోయిన్ గా కేథరిన్ థ్రెసాను ఫైనల్ చేశారనే న్యూస్ కూడా వచ్చింది. రవితేజ లేటెస్ట్ మూవీ అయిన “రాజా ది గ్రేట్” మూవీ రిలీజ్ తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైం కి ఈ మూవీ హీరోయిన్ కి సంబంధించిన ఒక ట్విస్ట్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ మూవీ నుంచి హీరోయిన్ గా కేథరిన్ థ్రెసాని తీసేసి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ విషయం పై హీరోతో చర్చలు నిర్వహించడం కాజల్ తో సంప్రదింపులు కూడా జరపడం కూడా ప్రారంభించారట ప్రొడ్యూసర్స్. అయితే కేథరిన్ ను తప్పించడానికి రీజన్ ఏంటనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కేవలం ఈ మూవీ రేంజ్ కి పెంచే ప్రాసెస్ లో కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలి అని అనుకున్నారు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తమిళ “బోగన్” కి డైరెక్టర్ గా వ్యవహరించిన లక్ష్మన్ ఈ తెలుగు రీమేక్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు.