My title

70శాతానికి పైగా పూర్తయిన కాలా

సూపర్ స్టార్ రజనీకాంత్ శరవేగంగా తన కొత్త సినిమా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో ఈ హీరో వరుసగా రెండోసారి నటిస్తున్న సినిమా కాలా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయింది. ముంబయి షెడ్యూల్ తో పాటు.. చెన్నైలో  వేసిన ధారావి సెట్ లో చేసిన షూటింగ్ తో ఈ మూవీ 70శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది.

మేకర్స్ చెబుతున్న సమాచార ప్రకారం… ఇంకా 30 నుంచి 45 రోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ లో ఉంది. కాకపోతే ఈ పెండింగ్ వర్క్ కోసం మరోసారి ముంబయి వెళ్లాల్సి ఉంది. ఈ షెడ్యూల్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా కాలాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు

సో.. వచ్చే ఏడాది సూపర్ స్టార్ నుంచి 2 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయన్నమాట. జనవరి 25న 2.0 సినిమా విడుదలకానుంది. ఆ మూవీ విడుదలైన 3-4 నెలల గ్యాప్ లోనే కాలా సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో రజనీ సరసన హుమా ఖురేసి హీరోయిన్ గా నటిస్తోంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ ప్రాజెక్టుకు నిర్మాత.