My title

ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా అటు బిగ్ బాస్ అంటూ ఇటు “జై లవ కుశ” అంటూ బిజీ బిజీ గా గడిపాడు. అసలు ఈ రెండు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వల్ల ఎన్టీఆర్ కి తన ఫ్యామిలీ తో స్పెండ్ చేయడానికి టైం దొరకలేదట. అయితే గత నెల దసరాకి “జై లవ కుశ” ని రిలీజ్ చేసి హిట్ ని అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీని మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వం లో చేయబోతున్నాడు. కాని ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా మూడు నెలల సమయం ఉందట. సో ఈ దొరికిన టైం గ్యాప్ లోనే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్ వెళ్దాం అని డిసైడ్ అయ్యాడు అని తెలుస్తుంది. అవును ఈ నెల 20న హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో కలిసి యూరప్ బయలుదేరుతున్న ఎన్టీఆర్ తిరిగి మళ్ళి హైదరాబాద్ ఎప్పుడు చేరుకుంటాడు అనే విషయంలో క్లారిటీ రాలేదు. యూరప్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం న్యూ లుక్ కి వర్కౌట్ చేస్తూనే ఫ్యామిలీ కోసం ఫుల్ గా టైం కేటాయించాలని డిసైడ్ అయ్యాడట. మొత్తానికి ఇన్ని రోజులు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం హాలిడేలో సేదతీరడానికి రెడీ అవుతున్నాడు.