My title

నవంబర్ 10న జూలీ-2 రిలీజ్

లెక్కప్రకారం జూలీ-2 సినిమా ఈపాటికి థియేటర్లలోకి రావాల్సింది. కానీ సైఫ్ అలీఖాన్ నటించిన చెఫ్ సినిమా నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక, చాలా ప్రాంతాల్లో బిజినెస్ పూర్తికాక లక్ష్మీరాయ్ నటించిన ఈ సినిమాను ఆఖరి నిమిషంలో వాయిదావేశారు. అలా ఓసారి వాయిదాపడిన జూలీ-2 సినిమాకు తాజాగా మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వచ్చేనెల 10న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు సినిమా ప్రజెంటర్, మాజీ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లద్ నిహలానీ ప్రకటించాడు.

పైకి చూడ్డానికి ఇది అడల్ట్ మూవీగా కనిపిస్తున్నప్పటికీ.. మంచి సందేశం ఉందంటోంది యూనిట్. మరోవైపు లక్ష్మీరాయ్ కూడా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానంటోంది. సినిమాలో తనను ఎక్స్ పోజింగ్ యాంగిల్ లా కాకుండా, ఎమోషనల్ యాంగిల్ లో చూడాలని రిక్వెస్ట్ చేస్తోంది. లక్ష్మీరాయ్ కు ఇదే మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో.. ప్రచారం కోసం బాగానే కష్టపడుతోంది. కాకపోతే ఆఖరి నిమిషంలో సినిమా వాయిదాపడ్డంతో కాస్త నిరుత్సాహానికి గురయింది.

బాలీవుడ్ లో సినిమాలు వాయిదా పడడం సాధారణంగా జరగదు. ఎందుకంటే దాదాపు 3 నెలల ముందు నుంచే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. అలాంటిది జూలీ-2 వాయిదా పడడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో నెల రోజులు టైం ఉంది కాబట్టి.. ఈలోగా ప్రత్యేకంగా ఏమైనా ప్రచారం షురూ చేస్తారేమో చూడాలి