My title

సింగిల్ కట్ కూడా లేకుండా విడుదలవుతున్న”జూలీ-2″

సౌత్ ఇండియన్ లో హీరోయిన్ గా పెరుతెచ్చుకొని ఐటెం సాంగ్స్ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లక్ష్మి రాయ్. ఆల్రెడీ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి రాయ్ ఇప్పుడు బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకుందాం అనుకుంటుంది. లక్ష్మీ రాయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం “జూలీ -2”. బోల్డ్, బ్యూటిఫుల్, బ్లెస్సెడ్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ చిత్రం దానికి తగ్గట్టే చాలా బోల్డ్ గా రూపొందింది అని ట్రైలర్ చూడాగానే అర్ధం అయింది.

పోస్టర్లు, టీజర్, ట్రైలర్లతో సంచలనంగా మారిన ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.  అయితే రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీ కి ‘A’ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అది కూడా ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ వాళ్ళు ఈ మూవీ కి A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను యాక్సెప్ట్ చేయడంతో అందులో ఎంత బలమైన కంటెంట్ ఉందో అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. దీపక్ శివదాసిని డైరెక్టక్ చేసిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు మూవీ యూనిట్.