My title

తాప్సీ బికినీపై కామెంట్లు

డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావుపై కామెంట్ల‌తో ఆ మ‌ధ్య వార్త‌లో నిలిచిన హీరోయిన్ తాప్సీ ఇప్పుడు బికినీతో మ‌ళ్లీ హైడ్‌లైన్ల‌లోకి ఎక్కారు. జుద్వా 2 సినిమా కోసం తాప్సీ గ్లామ‌ర్ ఒల‌క‌లు బోసింది. ఒక లెవ‌ల్లో రెచ్చిపోయింది. సినిమా ప్ర‌మోష‌న్ కోసం ట్విట్ట‌ర్‌లో తాప్సీ తాను బికినీ వేసుకున్న ఫొటో పెట్టింది. అంతేకాకుండా ఓ కాప్ష‌న్ రాసింది. కెరటానికి ఎదురెళ్ళాలనుకుంటే, ధృఢంగా నిలబడాలి…. ఆ క్షణాల్లో పెదాలపై చిరునవ్వు మాత్రం మర్చిపోవద్దు…. అంటూ కొటేష‌న్ పెట్టింది. అయితే ఈ పిక్‌, కామెంట్స్‌పై నెటిజ‌న్లు ఒక లెవ‌ల్లో రియాక్ట్ అయ్యారు. కొంద‌రు వ‌ల్గ‌ర్ కామెంట్స్ చేశారు. దీంతో వెంట‌నే వాటిని డిలీట్ చేశారు. నెటిజ‌న్ల కామెంట్స్‌కి వెంట‌నే తాప్సీ రియాక్ట్ అయ్యారు. భ‌య్యా ఇప్పుడు సోద‌రి స‌మాధాన‌మే రైట్ అంటూ లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది తాప్సీ. ఆ మ‌ధ్య‌ ఎక్స్‌పోజింగ్‌ చెయ్యనన్నావ్‌, ఇదేంటి.? అంటూ కొంద‌రు  ప్ర‌శ్నించారు. అయితే దీనికి మాత్రం తాప్సీ స‌మాధానం చెప్ప‌లేదు.