My title

లవకుమార్ చాలా క్యూట్ గా ఉన్నాడు

మెలితిప్పిన మీసాలతో, చేతిలో గొడ్డలితో చాలానే భయపెట్టాడు జై. కానీ ఈరోజు వచ్చిన లవకుమార్ మాత్రం చూడ్డానికి చాలా బాగున్నాయి. తొలిచూపులోనే అమ్మాయిలు ప్రేమలో పడిపోయేలా ఉన్నాడు. జై లవకుశ సినిమాకు సంబంధించి లవకుమార్ పాత్రకు సంబంధించిన లుక్ ను ఈరోజు విడుదల చేశారు.
జై లవకుశలో జై క్యారెక్టర్ నెగెటివ్ ఛాయల్లో ఉంటుందనే విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. దీనికి కంప్లీట్ రివర్స్ లో లవకుమార్ పాత్ర ఉంటుందనే విషయం ఈరోజు తెలిసొచ్చింది. లవ పాత్రలో బుడ్డోడు చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్నాడు. నిజానికి ఈ లుక్ చాలామందికి కొత్తకాదు. ఎందుకంటే జై లవకుశ సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే ఈ లుక్ బయటకొచ్చేసింది. ఎవరో కొందరు అత్యుత్సాహం కొద్దీ ఈ స్టిల్ ను అప్పట్లోనే లీక్ చేశారు. లవకుమార్ అనే నంబర్ ప్లేట్ కూడా అప్పుడే బయటపడింది. సో.. క్యారెక్టర్ పేరు కూడా అప్పుడే తెలిసిపోయిందన్నమాట. కాకపోతే ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసింది అఫీషియల్ గా అన్నమాట.
రాశిఖన్నా, నివేత థామస్, నందిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకుడు. వచ్చేనెల 21న జై లవకుశ సినిమా థియేటర్లలోకి వస్తుంది.