My title

ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్..

ప్రస్తుతం బాబి దర్శకత్వంలో జై లవకుశ అనే సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇందులో తారక్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడనే టాక్ నడుస్తోంది. దీనికోసం ముగ్గురు హీరోయిన్లను తీసుకుంటున్నారట. ఇందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు భామల్ని సెలక్ట్ చేశారు. తాజాాగా మరో భామను కూడా ఫిక్స్ చేశారు.

తాజా సమాచారం ప్రకారం, హీరోయిన్ నందిత, ఎన్టీఆర్ సరసన నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. గతంలో ప్రేమకథాచిత్రమ్ తో సహా పలు సినిమాల్లో నందిత నటించింది. మంచి నటిగా ఈమెకు గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ దక్కితే, నందిత కెరీర్ ఊపందుకోవడం ఖాయం.

ఈ సినిమాలో ఇప్పటికే రాశిఖన్నా ఫిక్స్ అయింది. తారక్-రాశిఖన్నా కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ. మరో హీరోయిన్ గా నివేదా థామస్ కూడా ఫిక్స్ అయింది. ఎన్టీఆర్-నివేది కాంబినేషన్ లో కూడా ఇదే ఫస్ట్ మూవీ. ఇప్పుడు నందిత కూడా ఫిక్స్ అయితే.. ఈ కాాంబినేషన్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఓవైపు దర్శకుడు బాబికి కూడా ఎన్టీఆర్ తో ఇదే ఫస్ట్ మూవీ. ఇలా అంతా కొత్తకొత్త కాంబినేషన్లతో తెరకెక్కుతోంది జై లవకుశ చిత్రం.