My title

బట్టలూడదీసి కొడితే బయటకొస్తాయి – జలీల్‌ ఖాన్

కేబినెట్ విస్తరణ జరిగితే మైనార్టీలకుమంత్రి పదవి వస్తుందన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్. బీకాంతో ఫిజిక్స్, మ్యాథ్స్‌ చదివానని చెప్పి ఇటీవల నవ్వులపాలైన నేపథ్యంలో జలీల్‌ ఖాన్‌ మంత్రి పదవి ఇచ్చే అంశంపైనా దాని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే జలీల్‌ ఖాన్‌ మాత్రం మంత్రిపదవిపై ధీమాతో ఉన్నారు. కేబినెట్‌ విస్తరణ జరిగితే మైనార్టీకి మంత్రి పదవి వస్తుందని… తాను మంత్రిని అవుతానని చెప్పారు. జగన్‌ లాంటి వారు వంద మంది వచ్చినా చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు.

వైఎస్ ఫ్యామిలీ రక్తపుటేరులు పారించిన ప్రాంతంలో చంద్రబాబు నీరు పారిస్తున్నారని చెప్పారు. 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయినా ఎందుకు వెళ్లిపోతున్నారని జగన్ ఒక్క మాట కూడా అడగలేదని జలీల్‌ ఖాన్‌ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ ఉండడం దురదృష్టకరమన్నారు. కేవీపీని బట్టలూడదీసి కొడితే ఎంత దోచుకున్నాడో బయటపడుతుందన్నారు. మరోవైపు కేవీపీ ఉడత ఊపులకు భయపడేందుకు ఇదేమీ రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డిల ప్రభుత్వం కాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అద్దె ఇంట్లో కాపురం చేసిన కేవీపీకి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. జగన్‌, బొత్స, కేవీపీ, రఘువీరారెడ్డిలు అధికార దాహంతో అల్లాడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + one =