My title

జై లవకుశ లేటెస్ట్ వరల్డ్ వైడ్ షేర్

ఎన్టీఆర్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన సినిమా జై లవకుశ. దసరా బరిలో అన్ని సినిమాల కంటే ముందే విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతం వసూళ్లు తగ్గాయి. విడుదలైన ఈ 19 రోజుల్లో జై లవకుశ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 79 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ షేర్ వాల్యూ కాస్త ఎక్కువగా కనిపించొచ్చు. కానీ ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఇది తక్కవే.

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు అటుఇటుగా 80 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. సో.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ సినిమా కనీసం మరో 10 రోజుల పాటు స్టడీగా కొనసాగాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో.. మరో 10 రోజుల్లో బయ్యర్లు అంతా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతారని అంచనా వేస్తున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. అయితే ఓవర్సీస్ లో మాత్రం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. జై లవకుశకు అక్కడ వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లపైనే ఆశలుపెట్టుకున్నారు నిర్మాతలు.