My title

మహేష్ వల్ల బ్రతికిపోయిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన “జై లవ కుశ” ఈ దసరాకి విడుదలై అవేరేజ్ టాక్ ని తెచ్చుకుంది. మొదటి వారం కలెక్షన్స్ లో ఎన్టీఆర్ కుమ్మేసిన గాని రెండో వారం మహేష్ నటించిన “స్పైడర్” రిలీజ్ అవ్వడం తో ఈ మూవీ సెకండ్ వీక్ కలెక్షన్స్ లో డ్రాప్ అయ్యింది. అయితే అందరూ ఇక “జై లవ కుశ” బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని అనుకున్నారు. వీకెండ్ అయ్యాక ఇంకా పాతిక కోట్ల పైగా వసూలు చేయాల్సిన స్థితిలో ఈ సినిమా బయ్యర్లకు పెద్ద ఎత్తునే నష్టాలు మిగిలుస్తుందని అంచనా వేశారు ట్రేడ్ వర్గాలు. కానీ అందరి అంచనాలని తారుమారు చేస్తూ ఇప్పుడు “జై లవకుశ” బ్రేక్ ఈవెన్‌కు చేరువగా వస్తోంది.

ఈ సినిమా రెండు రోజుల కిందటే రూ.75 కోట్ల షేర్ మార్కును అలాగే రూ.130 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఇంకో పది కోట్ల షేర్ వస్తే “జై లవ కుశ” బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసినట్లే. ఈ వీకెండ్ లో కొత్త సినిమాలేమీ లేవు కాబట్టి మంచి కలెక్షన్స్ ఏ వస్తాయని భావిస్తున్నారు. “జై లవకుశ” ఇలా సేఫ్ జోన్ లోకి వస్తోందంటే అది కేవలం “స్పైడర్” సినిమా వల్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే “స్పైడర్” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. ఇప్పుడు ఈ డివైడ్ టాక్ “జై లవ కుశ” మూవీ కి ప్లస్ పాయింట్ లాగ మారింది. ఒకవేళ “స్పైడర్” హిట్టయి ఉంటే “జై లవకుశ” కథ ఎప్పుడో ముగిసిపోయేది అంటున్నారు ట్రేడ్ వర్గాలు.