My title

U/A సర్టిఫికేట్ తెచ్చుకున్న “జై లవ కుశ”

జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన మూవీ “జై లవ కుశ”. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఈ మూవీ లో నివేత థామస్ , రాశి ఖన్నా లు హీరోయిన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ వేడుక జరుపుకున్న ఈ మూవీ యొక్క ట్రైలర్ ఇప్పటికే అందరికీ నచ్చేసింది. ముఖ్యంగా ట్రైలర్ లో జై అనే క్యారెక్టర్ కి అందరు కనెక్ట్ అయ్యారు అని చెప్పొచు. ఎందుకంటే నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వ రూపం చూపించాడు అనేది ట్రైలర్ చూసాక అర్ధం అయింది. ఇకపొతే ఈరోజు సెన్సార్ జరుపుకున్న ఈ మూవీ కి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికేట్ ని జారి చేసారు. జై అనే క్యారెక్టర్ లో ఎన్టీఆర్ జీవించేసాడు అని సెన్సార్ బోర్డు మెంబెర్స్ ఎన్టీఆర్ ని పొగిడేస్తున్నారు. సెప్టెంబర్ 21 వ తేదీన దసరా సందర్బంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది “జై లవ కుశ”. ఎన్టీఆర్ ని తొలి సారిగా నెగటివ్ షేడ్ లో చూడాలని నందమూరి ఫాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ ఫాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.