My title

రవితేజ కోసం టైటిల్ ఫిక్స్ చేసిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల ప్రెసెంట్ తన కెరీర్ విషయంలో దారుణమైన స్టేజి లో ఉన్నారు. ఎందుకంటే శ్రీను వైట్ల కి గత కొంత కాలంగా అసలు సక్సెస్ అనేదే లేదు. అయితే శ్రీనువైట్ల ఉన్న పోసిషన్ కి ప్రెసెంట్ ఏ ఒక్క హీరో కూడా డేట్స్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. కానీ శ్రీను వైట్ల బెస్ట్ ఫ్రెండ్, సన్నిహితుడు అయిన రవితేజ మాత్రం శ్రీను వైట్లకి పిలిచి మరీ డేట్స్ ఇచ్చాడు. శ్రీనువైట్ల నిర్మాణ భాగస్వామిగా ఉండి మరీ ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

ఇప్పటికే “మిస్టర్” వల్ల చాలా లాస్ అయిన శ్రీనువైట్ల ఈ మూవీ కోసం ఉన్నది మొత్తం పెట్టేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం శ్రీను వైట్ల    “అమర్ అక్బర్ అంటోని” అనే టైటిల్ ని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాడట. తన మార్క్ అయిన కామెడీతో పాటు మంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు శ్రీను వైట్ల. మరి ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో నటిస్తాడా లేదా ఒకే పాత్రతో స్క్రీన్ ప్లే పరంగా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తాడా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ మూవీ హిట్ మీదే శ్రీను వైట్ల కెరీర్ ఆధారపడి ఉంది.