My title

హిందూ యువ వాహిని ఇష్టా రాజ్యం

మూసి వేసిన మాంసం దుకాణాలు.

గోరఖ్ నాథ్ పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ 2002వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన హిందూ యువవాహిని ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గరనుంచి నూతనోత్సాహం ప్రదర్శిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయిలను వేధించే ‘పోకిరీలకు’ బుద్ధి చెప్పడం, లైసెన్సులు లేని కబేళాలను, మాంసం దుకాణాలను మూసివేయిస్తోంది.  హిందూ మత పరిరక్షణ కోసం ఆదిత్య నాథ్ హిందూ యువవాహినిని ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 20 లక్షల మంది ఉన్నట్టు అంచనా.

ఇటీవల ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడంలో హిందూ యువ వాహినిదే ప్రధానమైన పాత్ర అన్న వాదనలూ ఉన్నాయి.

పంకజ్ సింగ్

అమ్మాయిలను ఏడిపించే వారికి హిందూ యువవాహిని కార్యకర్తలు ‘బుద్ధి’ చెప్తుంటారు. కబేళాలను, మాంసం దుకాణాలను మూసి వేయిస్తారు. గోవులను తరలిస్తున్న వారి గురించి పోలీసులకు సమాచారం అందిస్తారు. ఇవన్నీ చట్టబద్ధమైన వ్యవహారాలుగానే పైకి కనిపిస్తాయి. కాని రోమియోలకు బుద్ధి చెప్పడంలో, మాంసం దుకాణాలను మూసివేయించడంలో హిందూ యువవాహిని కార్యకర్తలు సాధారణంగా తామే ఆయుధ పాణులై రంగంలోకి దిగుతారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. పోలీసులు తాము చెప్పినట్టుగా చేయాలంటారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి హిందూ యువ వాహిని కార్యకర్తలు ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే వీదుల గుండా ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. “రక్తం చిందిస్తాం. కాని ఆ బాధ ముస్లింలు అనుభవిస్తారు” అని హిందూ యువవాహిని సీనియర్ నాయకుడు పంకజ్ సింగ్ అన్నారు.

ఆయుధాలు చేతబూని తన అనుచరులతో కుసుమ్ సింఘ్

అమ్మాయిలను ఏడిపించే వారి మీద చర్య తీసుకోవడానికి ఏర్పాటు చేసిన 64 ప్రత్యేక దళాలను పర్యవేక్షించే ఓ పోలీసు సీనియర్ అధికారి ఇవి పోకిరీలను అదుపు చేయడం కోసం ఏర్పాటు చేశారు కాని ఎక్కువగా ముస్లిం యువకులమీదే చర్యతీసుకుంటున్నారు అని చెప్పారు. తన పేరు బయట పెట్టడానికి ఆయన అంగీకరించలేదు. హిందూ యువతులతో ఉండే ముస్లిం యువకుల మీద చర్య తీసుకోవాలని హిందూ యువ వాహిని కార్యకర్తలు తమ మీద ఒత్తిడి చేస్తారని మాత్రం అంగీకరించారు.

“ఆదిత్య నాథ్ అధికారం చేపట్టిన 24 గంటల లోగా మేం 45,000 మాంసం దుకాణాలను మూసివేయించాం, మా విభాగాలు సమాచారం అందించక పోతే అది సాధ్యమయ్యేది కాదు” అని పంకజ్ సింఘ్ చెప్పారు. హిందూ యువ వాహిని నుంచి ఒత్తిడి పెరిగిన తర్వాత అనేక మంది మాంసం దుకాణాలు మూసి వేసి ఖాళీగా ఉన్నారు. తమ బతుకు ఎలా గడవాలి అన్నది వారి చింత.

 

కరవాలంతో హిందూ యువవాహిని మహిళా కార్యకర్త

రోమియో వ్యతిరేక దళం