My title

ట్రావెల్ ఇండ‌స్ట్రీలో 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు

ఇండియ‌న్ ట్రావెల్ ఇండ‌స్ట్రీలో దాదాపు 10ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు అవ‌కాశం ఉంద‌ని వ‌రల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ నివేదిక తెలిపింది. భార‌త‌దేశంలో ప‌ర్యాట‌కులు పెరుగుతున్నార‌ని…త‌ద్వారా ఎకో టూరిజం, క్రూయిజ్ టూరిజం రంగాల‌కు మంచి డిమాండ్ ఉంటుంద‌ని వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ వెల్ల‌డించింది. భార‌త‌దేశంలో ఉన్న దాదాపు 6 ల‌క్ష‌ల గ్రామాల‌లో వైవిధ్యాన్ని ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌కు తెలియ‌జేయ‌వ‌చ్చని ఆ సంస్థ తెలిపింది.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా పేరిట భార‌త‌దేశం టూరిజం అధివృద్ధికి చేస్తున్న ఫ‌లితాలు మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ త‌న నివేదికలో వివ‌రించింది.

భార‌త్‌లో టూరిజం అభివృద్ధికి ఇంకా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను కూడా నివేదిక విస్తృతంగా చ‌ర్చించింది. ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో అనేక అద్బుతాలు చేయ‌వ‌చ్చని నివేదిక వెల్ల‌డించింది. దేశంలో టూరిజం బోర్డు ఆవ‌శ్య‌క‌త‌ను కూడా నివేదిక ప్రముఖంగా చ‌ర్చించింది.

భార‌త‌దేశంలో ట్రావెల్ అండ్ టూరిజం ప‌రిశ్ర‌మ ముక్క‌లు ముక్క‌ల మాదిరిగా ఉంద‌ని…దాన్ని మ‌రింత ప‌టిష్టంగా చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని నివేదిక అభిప్రాయ‌ప‌డింది.

2016లో భార‌త‌దేశానికి 9 ల‌క్ష‌ల మంది విదేశీ ప‌ర్యాట‌కులు వ‌చ్చిన విష‌యాన్ని నివేదిక గుర్తుచేసింది. అదే విధంగా ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటెటివ్‌నెస్ రిపోర్ట్‌లో భార‌త్ స్థానం మెరుగుప‌డిన విష‌యాన్ని కూడా నివేదిక ప్ర‌స్తావించింది. 2013లో 63 వ స్థానంలో ఉన్న భార‌త్ ప్ర‌స్తుతం 40 వ స్థానానికి చేరుకుంద‌ని వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోర‌మ్ నివేదిక తెలిపింది.