My title

ఇదీ మ‌న భార‌తం!

ఇప్ప‌టికీ మ‌న‌దేశంలో క‌రెంటు లేక బుడ్డిదీపాల‌తో బ‌తుకు వెళ్ల‌దీస్తున్న‌వాళ్లు 24 కోట్ల‌మంది ఉన్నారు.

ఇంకా మ‌న‌దేశంలో శుభ్ర‌మైన తాగు నీరు లేని గ్రామాలు  ల‌క్ష‌కు పైగా ఉన్నాయి.

టాయిలెట్ లేని ఇళ్లు ఎన్నో ల‌క్ష‌లు. స్వ‌చ్‌భార‌త్ అంటూ కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ప్ప‌టికీ

ఇప్ప‌టికీ మ‌న‌దేశంలో ఏటా ఐదు ల‌క్ష‌ల మంది పిల్ల‌లు టీబీతో చ‌నిపోతున్నారు.

త‌క్కువ బ‌రువుతో పుట్టే పిల్ల‌లు మ‌న భ‌విష్య‌త్తు భార‌తాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు.

మ‌న జ‌నాభాలో ఆరు కోట్ల‌మందికి పైగా డ‌యాబెటిస్ బారిన ప‌డిన వాళ్లున్నారు.

అయినా స‌రే!

ఇన్ని స‌వాళ్లు మ‌న ఎదురుగా ఉన్నాయి. అయినా మ‌న‌దేశంలో హెల్త్ రీసెర్చ్ ప‌ట్ల ప్ర‌భుత్వాలు త‌గినంత ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితి ఇలాగే ఉంటే… భ‌విష్య‌త్తు భ‌యాన‌కమే. లాభం లేదు…  ఇక శాస్త్ర‌వేత్త‌లే స్వ‌యంగా పూనుకోవాలి. ప‌రిశోధ‌న‌ల కోసం బ‌య‌టిదేశాల‌కు వెళ్లిన సైంటిస్టులు భార‌త్ కోసం టైమ్ కేటాయించాలి. భార‌త్ వైపు దృష్టి కేంద్రీక‌రించాలి. రీసెర్చ్ ఇన్‌స్టిట్యూష‌న్‌ల‌ను ఇండియాలో పెట్టాలి. గివింగ్ బ్యాక్ టు హోమ్‌ల్యాండ్ అని పిలుపునిచ్చారు సైంటిస్టులు.

ఇండియా సాధించిన డెవ‌ల‌ప్‌మెంట్‌ను కాద‌న‌లేం కానీ, హెల్త్ ప‌రంగా ఇండియా సాధించిన దానికంటే సాధించాల్సిందే ఎక్కువ‌గా ఉంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు.