My title

జేసీకి చుక్కెదురు…. హైకోర్టు సూటిప్రశ్న….

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో సిబ్బందిపై  దాడి కారణంగా   ట్రావెల్‌ బ్యాన్‌ ఎదుర్కొంటున్న జేసీ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తనపై ట్రావెల్‌ బ్యాన్‌ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు జేసీ విజ్ఞప్తిని తోసి పుచ్చింది. మీ జేసీ ట్రావెల్స్‌లోనూ ప్రయాణికుల్లో ఎవరైనా ఇలాగే సిబ్బందిపై దాడి చేస్తే ప్రయాణికున్ని మీరు అనుమతిస్తారా? అని జేసీని కోర్టు ప్రశ్నించింది.

పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున తాత్కాలికంగానైనా తనపై ట్రావెల్‌ బ్యాన్‌ ఎత్తివేసేలా చూడాలని జేసీ విన్నవించుకున్నారు. అందుకు కూడా హైకోర్టు సమ్మతించలేదు. విమానయాన సంస్థల వాదన వినకుండానే తాము ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణకోసం కేసును హైకోర్టు వాయిదా వేసింది.