My title

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సుశాంత్ నెక్స్ట్ మూవీ

అక్కినేని హీరో సుశాంత్ కి గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక కెరీర్ లో తడబడుతున్నాడు. సుశాంత్ లాస్ట్ మూవీ అయిన “ఆటాడుకుందాం రా” కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అందుకే ఈ సారి ఆచి తూచి సినిమాల్ని ఎంపిక చేసుకుందాం అనుకుంటున్నాడు సుశాంత్. అయితే సుశాంత్ ఈరోజు తన కొత్త మూవీ అయిన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ని స్టార్ట్ చేసాడు. ఈ మూవీ ని హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈరోజు ఉదయమే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. అయితే ఈ మూవీ కి “చి౹౹ల౹౹సౌ౹౹” (చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫైనల్ చేసారు మూవీ టీం. ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియా లో రిలీజ్ అయిపొయింది.

ఇకపోతే ఈ మూవీ యొక్క టైటిల్ చూస్తుంటే ఈ మూవీలో  హీరోయిన్ కీ రోల్ గా సాగుతుంది అని అర్ధం అవుతుంది. సిరుని సినీ కార్పొరేషన్ పై హరి, జస్వంత్, భారత్ కుమార్ లు నిర్మిస్తున్న ఈ మూవీ లో సుశాంత్ సరసన కొత్త హీరోయిన్ అయిన రుహాని నటిస్తుండగా వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. మరి ఇక్కడ ఒక హీరో డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ పై అందరిలోని అంచనాలు నెలకొన్నాయి.