My title

శృతి హాసన్ పోయి…. హన్సిక వచ్చె!

తమిళ్ లో సంఘమిత్ర పేరుతో భారీ సినిమా రూపొందుతోన్న విషయం…. అందులో ముందుగా శృతి హాసన్ ను తీసుకోవడం…. తర్వాత…. ప్రాజెక్టు నుంచి ఆమె మాయం కావడం…. అంతా తెలిసిందే. దీంతో శృతి స్థానంలో ఎవరు సంఘమిత్ర టైటిల్ రోల్ చేస్తారో అని తమిళ్ తో పాటు…. తెలుగు, మలయాళ సినీ అభిమానులు కూడా వెయిట్ చేశారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు సినిమా యూనిట్ ఎండ్ కార్డ్ వేసినట్టే కనిపిస్తోంది. 

ప్రస్తుతం… సంఘమిత్ర టైటిల్ రోల్ కోసం వినిపిస్తున్న పేర్లలో హన్సిక టాప్ లీడ్ లో ఉంది. ఆ అంచనాలకు బలాన్నిస్తూ…. రీసెంట్ గా హన్సికకు స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందట. ఇప్పటికే…. రకరకాల కేరెక్టర్లతో తమిళనాట అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న హన్సిక…. ఇప్పుడు సంఘమిత్రగా నటిస్తే…. డెఫినెట్ గా మంచి అవుట్ పుట్ వస్తుందని అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. 

ఈ నమ్మకానికి తగ్గట్టే…. హన్సిక కూడా…. లుక్స్ లో అదరిపోయినట్టు తెలుస్తోంది. దీంతో…. సుందర్ దర్శకత్వంలో వస్తున్న సంఘమిత్రలో…. హన్సిక టైటిల్ రోల్ ప్లే చేయడం కన్ఫమ్ అయినట్టే అని అంతా అనుకుంటున్నారు.