My title

250 కోట్ల సినిమాలో హన్సిక లేదు

దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో త్వరలోనే సెట్స్ పైకి రానుంది సంఘమిత్ర సినిమా. నిజానికి ఈ సినిమా ఈపాటికే సెట్స్ పైకి రావాల్సింది. ఆఖరి నిమిషంలో శృతిహాసన్ హ్యాండ్ ఇవ్వడంతో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఆ పాత్ర కోసమే శృతి స్థానంలో చాలామంది పేర్లను పరిశీలించి, అంతిమంగా హన్సికను సెలక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే హన్సిక కూడా సంఘమిత్ర నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

సంఘమిత్రలో లీడ్ రోల్ చేయాలంటే చాలా కష్టపడాలి. కత్తియుద్ధం నేర్చుకోవాలి, గుర్రపుస్వారి నేర్చుకోవాలి. వీటన్నింటికీ మించి భారీగా కాల్షీట్లు చేయాలి. ఇంకా చెప్పాలంటే సంఘమిత్ర పూర్తయ్యే టైమ్ కు ఓ హీరోయిన్ 3 సినిమాలు చుట్టేస్తుంది. అందుకే ఇందులో నటించేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తాజాగా హన్సిక కూడా తప్పుకోవడంతో సంఘమిత్ర కష్టాలు సేమ్ టు సేమ్ అలానే ఉండిపోయాయి.

నిజానికి సంఘమిత్రలో నటించడానికి హన్సిక ఒప్పుకుంటుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సి.సుందర్ కు హన్సిక చాలా క్లోజ్. దాదాపు ఇంట్లో మనిషి కింద లెక్క. సి.సుందర్ భార్య ఖుష్బూకు కూడా హన్సిక వెరీ క్లోజ్. కాబట్టి సంఘమిత్రలో నటించడానికి ఆపిల్ బ్యూటీ ఒప్పుకుంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ హన్సిక మాత్రం హ్యాండ్ ఇచ్చిందట.