My title

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

తన సినిమాలో పవన్ ఏదైనా ఫోక్ సాంగ్ పాడాడంటే.. ఆ సినిమా కచ్చితంగా హిట్టే. తమ్ముడు సినిమా నుంచి అత్తారింటికి దారేది వరకూ.. ఈ సెంటిమెంట్ ప్రూవ్ అవుతూనే వస్తోంది. అందుకే.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమాలో.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేసేస్తున్నాడట.. పవర్ స్టార్.

ఇప్పటికే పవన్ ఇచ్చిన ఇన్ పుట్స్ తో.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. ఓ ట్యూన్ కంపోజ్ చేశాడనీ.. ఆ పాటను హైదరాబాద్ లో షూటింగ్ కూడా చేసేశారని తెలుస్తోంది. సినిమాలో ఇది కూడా ఓ హైలెట్ కావడం ఖాయమని యూనిట్ నమ్ముతోంది.