My title

నిరసనలతో హోరెత్తిన బెంగళూరు

గౌరీ లంకేశ్‌ హత్యకు గురై వారం రోజులు అయిన సందర్భంగా ఈరోజు (మంగళవారం) బెంగళూరులో 50 వేలమంది నిరసన ప్రదర్శన చేశారు. గౌరీ హత్య విరోధి వేదిక ఇచ్చిన పిలుపుమేరకు దేశం నలుమూలల నుండి తరలివచ్చిన 50 వేలమంది ప్రజాస్వామిక వాదులతో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో మేథా పాట్కర్‌, జిగ్నేష్‌ మేవాని, ఆసిష్‌ ఖేతన్‌, పి సాయినాథ్‌, తీస్తా సెతల్వాద్‌, కవితా కృష్ణన్‌, ఆనంద్‌ పట్వర్ధన్‌ తదితర ఉద్యమనాయకులతో పాటు వామపక్షాలకు సంబంధించిన పలువురు నాయకులు, ప్రజాసంఘాలు, పలు దళిత, మహిళా సంఘాలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నాయి.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రచయితలు, కవులు, జర్నలిస్టులు, విద్యార్ధులు, కార్మిక సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. గౌరీ లంకేశ్‌ను హత్యచేసిన వారికి శిక్షపడేవరకు ఈ పోరాటం ఆగదని, అంతవరకూ ఇదే స్ఫూర్తితో అందరం కలిసి పోరాడదామని ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన వక్తలు పేర్కొన్నారు.