My title

ఈ ఆదివారమే సాహో ఫస్ట్ లుక్

బాహుబలి-2 సినిమా ఇంకా రిలీజ్ కాకముందే నెక్ట్స్ మూవీ టీజర్ రెడీ చేశాడు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ ఫస్ట్ లుక్ మాత్రం రెడీ అయింది. టీజర్ కూడా సిద్ధమైంది. ఈ ఫస్ట్ లుక్, టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ నిర్వహించారు. సాహో ఫస్ట్ లుక్ ను ఆదివారం విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 28న సాహో టీజర్ విడుదలకానుంది. అది కూడా బాహుబలి-2 సినిమాతో. ఇంతకుముందే చెప్పుకున్నట్టు బాహుబలి-2 సినిమా ఇంటర్వెల్ లో సాహో సినిమా టీజర్ ప్రసారం అవుతుంది. 90శాతం గ్రాఫిక్స్, 10శాతం విజువల్స్ తో ఈ టీజర్ తెరకెక్కింది. అంతేకాదు, ఈ టీజర్ లో ఓ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ కూడా ఉందట.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుంది సాహో సినిమా. బాహుబలి మేనియాను క్యాష్ చేసుకునేందుకు సాహో సినిమా టీజర్ ను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.