My title

2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఫిదా

శేఖర్ కమ్ముల డైరక్ట్ చేసిన ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. దీనికి సాక్ష్యం కూడా రెడీగా ఉంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా తాజాగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ ఘనత సాధించింది ఫిదా చిత్రం. వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.

ఈ సినిమా దెబ్బతో ఇప్పటివరకు కష్టాల్లో ఉన్న దిల్ రాజు, తన అప్పులన్నీ తీర్చేసుకున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఫిదా సినిమా దిల్ రాజుకు 150శాతం ప్రాఫిట్స్ తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే, అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది ఫిదా. అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్, గౌతమీపుత్రశాతకర్ణి సాధించిన రికార్డుల్ని వెనక్కి నెట్టింది.

ప్రస్తుతం సాధించిన రికార్డుల్ని మించి ఫిదా సినిమా కొత్తగా రికార్డులు సృష్టించే అవకాశం లేదు. ఎఁదుకంటే ఈ వీకెండ్ ఏకంగా 3 చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటి రాకతో ఫిదాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా థియేటర్లు తగ్గిపోయాయి. నాలుగో వారంలోకి ఎంటరైన ఫిదా సినిమా త్వరలోనే తన ఫైనల్ రన్ ముగించబోతోంది.